సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ అసహనానికి గురైంది. ఓ రిపోర్టర్ ఆడిగిన ప్రశ్న ఆమె కోపం తెప్పించింది. ఇంతకీ ఏం అయిదంటే.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన ఆమెను ఒక రిపోర్టర్.. పెళ్లయిన తర్వాత కూడా మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటని అడిగాడు. అయితే ఈ ప్రశ్న శ్రియకు కోపం వచ్చింది. ఎందుకు హీరోయిన్లను మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? అంటూ సీరియస్ అయింది..
ఇలాంటి ప్రశ్నలు హీరోలను కూడా అడిగిన రోజే తాను సమాధానం చెబుతానంటూ శ్రియ ఫైర్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక 2018లో ఆండ్రూ అనే వ్యక్తిని శ్రియ పెళ్లిచేసుకుంది. లాక్ డౌన్ సమయంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ కూతురు పేరు రాధ. ఇక శ్రియ తల్లి అయ్యిందనే వార్తని కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. బాడీ షేమింగ్‌కు గురికావాల్సి వస్తుందేమోననే ఈ వార్తను దాచింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలాంటి వార్తలతో విసిగిపోయిన శ్రియ తాజాగా ఆలా స్పందించి ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు..!!