సినీ రంగంలో రక రకాల ఇగోలు ఉంటాయి, అందరు కలసి ఉన్నట్లే ఉంటారు కానీ ఇగో విషయంలో కాంప్రమైస్ కారు.ముఖ్యంగా మల్టీ స్టార్రర్ చిత్రాలలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందు వేయాలి అనేది ఒక బ్రహ్మ పదార్ధం వంటిది. ఎన్ని తరాలు గడిచిన దానికి సరి అయిన సమాధానం దొరకనిది. 1995 లో సుమన్, కృష్ణం రాజు గారు కలసి నటించిన చిత్రం ” లీడర్ “, సినిమా ప్రారంభానికి ముందు ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసారు, అందులో ముందు సుమన్ పేరు ఆ తరువాత కృష్ణం రాజు గారి పేరు వచ్చింది అది చూసిన కృష్ణం రాజు గారు హర్ట్ అయ్యారు…
షూటింగ్ నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. జరిగిన పొరపాటు తెలుసుకున్న డైరెక్టర్ పి.యెన్.రామచంద్ర రావు వెళ్లి జరిగిన పొరపాటుకు కృష్ణం రాజు గారికి క్షమాపణ చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న సుమన్ కూడా జరిగిన పొరపాటుకు నొచ్చుకొని, కృష్ణం రాజు గారి వంటి లెజెండరీ ఆర్టిస్ట్ పేరు ముందుగా వేయటం సమంజసం అని నిర్మాత, డైరెక్టర్ తో మాట్లాడి, జరిగిన పొరపాటును సరిదిద్దారు. అంతటి తో వివాదం సమసి పోయింది, కృష్ణం రాజు గారు షూటింగులో పాలుగొనటం జరిగింది.