పొన్నియిన్ సెల్వన్ చిత్రం తిరస్కరించడానికి నా వద్ద విలువైన కారణముంది. ఈ సినిమా కోసం మణిరత్నం సర్ నాకు ఆడిషన్ నిర్వహించారు. నేను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశాను. ఎందుకంటే నేను మణిరత్నంకు పెద్ద ఫ్యాన్. కానీ ఆ సమయంలో ఆ ఆఫర్ నాకు దక్కలేదు. అప్పుడు నేను చాలా నిరాశ, బాధకు లోనయ్యాను. అని అమలా పాల్ స్పష్టం చేసింది..అయితే 2021లో తనకు పొన్నియిన్ సెల్వన్‌లో నటించాల్సిందిగా మళ్లీ అవకాశమొచ్చిందని అమల తెలిపారు. “2021లో మళ్లీ పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్టులో నటిచే అవకాశం వచ్చింది.
కానీ ఆ సమయంలో ఆ చిత్రం చేసే మానసిక స్థితిలో నేను లేను. అందుకే నేను చేయలేనని చెప్పాను. ఒకవేళ ఈ నిర్ణయంపై మీరు బాధపడుతున్నారా? అని నన్ను ప్రశ్నిస్తే.. లేదని స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని విషయాలు కచ్చితంగా ఉంటాయి. కచ్చితంగా రూపొందిస్తారు. వాటిని మనం ఎలా చూస్తామో.. అలా మాత్రమే ఉంటాయని నేను భావిస్తున్నాను” అని అమలా పాల్ చెప్పింది. ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు..!!