in

shocking, casting couch issues leaked in ‘jabardasth ‘show!

కప్పుడు ఏకంగా 14 వరకు రేటింగ్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఒక కామెడీ షోకు.. అందులోనూ ఒక రియాలిటీ షోకు ఇంత రేటింగ్ వస్తుందా అని అప్పట్లో అందరూ నోరెళ్లబెట్టారు. దీన్ని చూసి మిగిలిన ఛాన‌ల్స్‌లో కూడా అచ్చం అలాంటి కాన్సెప్ట్ తోనే కామెడీ షో మొదలు పెట్టి చేతులు కూడా కాల్చుకున్నారు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న జబర్దస్త్ కామెడీ షోపై ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి..ఒకప్పుడు అబ్బాయిలు లేడీ గెటప్ వేసుకొని కామెడీ చేసే వాళ్లు. అయితే గత కొన్ని నెలలుగా అమ్మాయిలు జబర్దస్త్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారు.

ప్రతీ టీమ్ లో కూడా ఒక అమ్మాయి ఉంది. వీళ్లకు కొందరు సీనియర్ కమెడియన్స్ నుంచి అసభ్య ప్రవర్తన ఎదురవుతుందని.. సాయంత్రం ఖాళీగా ఉన్నారా కలుద్దామా లాంటి అనుభవాలు సమస్యల రూపంలో వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నిర్వాహకుల వరకు ఈ విషయం తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయిందని.. సదరు సీనియర్ కమెడియన్స్ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్వాహకులకు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం బంగారం లాంటి జబర్దస్త్ ప్రతిష్ట మసకబారడం ఖాయం.

Sithara does not like those scenes at all: Mahesh Babu

raashi khanna stills in red short dress!