నిర్మాత ఎం.ఎస్. రాజు గారు, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన మొట్ట మొదటి చిత్రం ” శత్రువు” లో శోభన్ బాబు గారు హీరోగా నటించవలసింది కానీ వెంకటేష్ నటించారు. ఏం.ఎస్.రాజు గారికి, శోభన్ బాబు గారితో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి, అయన నిర్మాత గ మారిన తరువాత, శత్రువు సబ్జెక్టు శోభన్ బాబు గారికి చెప్పి హీరో గ నటించవలసిందిగా కోరారు. స్నేహితుల హితం కోరే శోభన్ బాబు గారు, చిత్ర నిర్మాణం చాల అనిశ్చితమయినది, ఒక వేళ ఆ సినిమా వలన నష్టాలూ వస్తే మన మధ్య ఉన్న స్నేహం దెబ్బ తింటుంది, మన కుటుంబ బాంధవ్యాలు కొనసాగించలేక పోవచ్చు,కాబట్టి ఈ సినిమా నేను చెయ్యను,
నువ్వు కూడా సినీ నిర్మాణం జోలికి వేళ్ళకు అని చెప్పేశారట. ఏది ఏమయినా సినీ నిర్మాణం చేపట్టాలి అని నిర్ణయించుకున్న రాజు గారు, ఇక చేసేదేమి లేక వెంకటేష్ గారి కాల్ షీట్స్ కోసం రామ నాయుడు గారిని కలిశారు, అప్పటికి వెంకటేష్ కెరీర్ కొంచెం ఒడిదుడుకుల్లో ఉండటం తో, నిర్మాత గ ఆయన కూడా సముఖత చూపలేదట. నిర్మాతగా మొదటి చిత్రం రిస్క్ చేయటం ఎందుకు అన్నారట. ఏది ఏమైనా వెంకటేష్ గారే నా సినిమా హీరో అని రాజు గారు పట్టు పట్టి, రామ నాయుడు గారిని ఒప్పించి, వెంకటేష్ గారు హీరో గ “శత్రువు” సినిమా తీశారు. ” శత్రువు” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే.