in

shakila shocking comments about her director and relatives!

టనతో రెండు దశాబ్దాలకు పైగా సినీప్రియులను అలరించింది షకీలా. ఈ మధ్యే ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ రిలీజవగా అది బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తనను అందరూ మోసం చేశారని వాపోయింది. ఎవరినీ అంత సులభంగా నమ్మాలనుకోవడం లేదని తెలిపింది. బంధువులు తన దగ్గర ఆర్థిక సాయం పొందిన తర్వాత మోసం చేశారని పేర్కొంది. షకీలా బయోపిక్‌ డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ లోకేశ్‌ను గుడ్డిగా నమ్మినందుకు పశ్చాత్తాపపడుతున్నానంది. ‘ఇంద్రజిత్‌ లోకేశ్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవడానికి ముందు నాతో చర్చించాడు. కానీ తర్వాత అతడికి నచ్చినట్లుగా స్క్రిప్ట్‌ మార్చేశాడు. ఈ బయోపిక్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. ప్రస్తుతం నా ప్రాజెక్టుల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ సినిమాల్లో కొన్ని సహాయక పాత్రలు చేస్తున్నా. అలాగే దవ్వు మాస్టర్‌ అనే కన్నడ సినిమా చేస్తున్నా. ఇందులో పెంపుడు కుక్కతో ప్రేమలో పడే మహిళ పాత్రలో కనిపిస్తాను’ అని షకీలా చెప్పుకొచ్చింది.

these white dress stills of sonam kapoor will melt ur heart!

top 10 flop movies of tollywood in 2021!