
షకీలా గారు తన మొదటి చిత్రాన్ని సిల్క్ స్మిత గారితో కలిసి నటించారు. అయితే తొలి చిత్రం లోనే తనకు ఒక చేదు అనుభవం ఎదురైంది. సినిమాలో షకీలా గారు స్మిత గారికి చెల్లిగా నటించారు. సినిమాలో ఒక బెడ్ రూమ్ సీన్ చేయాలి అందులో భాగంగా షకీలా గారి చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టాలి అనేది షాట్ అని డైరెక్టర్ గారు చెప్పారట. ఆ సీన్ కోసం షకీలా ఇంక స్మిత గారు ఎన్నో రిహార్సల్స్ చేశారట. అయితే రిహార్సల్స్ అయిపోయాక కెమెరా ముందు వెళ్ళగానే స్మిత గారు షకీలా గారి చెంప మీద గట్టిగ కొట్టేశారట. దానికి కన్నీళ్లు ఆపుకోలేని షకీలా గారు ఇంక నేను షూటింగ్ కి రాను అంటూ ఇంటికి వెళ్లిపోయారు. తను బాధ పడ్డ విషయం గ్రహించిన స్మిత గారు నేరుగా షకీలా ఇంటికివెళ్ళి ఇలా చెప్పారట ” మనం ఆ సీన్ రిహార్సల్స్ చేస్తుంటే నువ్వు టవల్ కట్టుకొని ఉన్నావు కదా, అది జేరిపోతే షూటింగ్ స్పాట్ లొ ని పరువు పోతుంది కదా, అల జరగొద్దని ఒక్క షాట్ లొ చేయడానికి నిన్ను అల కొట్టాను’ అని సర్దిచెప్పారట స్మిత గారు.

