in

Shah Rukh Khan to play a powerful role in allu arjun’s raaka?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ ‘రాకా’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఒక శక్తివంతమైన అతిథి పాత్రలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’ సినిమాతో షారుఖ్ భారీ విజయాన్ని అందుకున్నారు.

ఆ సాన్నిహిత్యంతోనే అల్లు అర్జున్ సినిమాలో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వెండితెరపై ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి కనిపించడం సినీ ప్రియులకు కనువిందే. ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తున్నట్లు సమాచారం. అయితే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రధాన నటీనటుల విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది..!!

dhurandhar beauty Sara Arjun to replace Rukmini Vasanth?

Triptii Dimri – first-ever brand ambassador for Victoria’s Secret India!