in

service without publicity, says milky beauty!

రోనా సంక్షోభ సమయంలో సినీ తారలు ఆశించినంత సేవాకార్యక్రమాలు చేపట్టలేదనడం అర్థరహితమని పేర్కొంది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. చాలా మంది ప్రచారానికి దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు.

అయితే చేసిన సాయం గురించి చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. దానినుంచి కొందరైనా స్ఫూర్తిపొంది మరింత సాయం చేయడానికి ముందుకొస్తారు. వ్యక్తిగతంగా మాత్రం నేను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను. చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను’ అని తెలిపింది. సినీ తారలకు అపారమైన సంపద ఉంటుందని, వారు ఎక్కడకు వెళ్లినా విలాసవంతంగా ఉంటారనే అపోహలు కూడా తొలగిపోవాల్సిన అవసరం ఉందని తమన్నా చెప్పింది.

Sukumar’s wife tabitha takes charge of ‘Sukumar Writings’!

anitha chowdhary about caste feelings in cine industry!