సినీ ఇండస్ట్రీలో కొత్త వారికి సీనియర్స్ నుండీ కాస్త.. చిరాకులు, పరాకులు ఎదురవుతూ ఉంటాయి. ఇది చాలా కామన్..! ఎంత కోపం వచ్చినా… బాధ వచ్చినా… వాటిని తట్టుకుని నిలబడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మనం అలనాటి హీరోయిన్ జయంతి గారిని ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈమె కన్నడంలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న రోజులవి. అదే టైములో ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో దివంగత మహానటి సావిత్రి కూడా నటిస్తున్నారట. అది తమిళ సినిమా కాబట్టి.. జయంతి గారికి ఆ భాష రాదు.
డైలాగులు కూడా చెప్పడానికి ఇబ్బంది పడ్డారట. డైరెక్టర్ కూడా అనేక షాట్లు తీస్తూనే ఉన్నాడటఅప్పుడు తదుపరి షాట్ కోసం వెయిట్ చేస్తున్న సావిత్రి గారు.. డైరెక్టర్స్ కు యూనిట్ డైరెక్టర్స్ కు చివాట్లు పెట్టారట. డైలాగ్ చెప్పడం కూడా రానివారిని ఎలా తీసుకున్నారు అంటూ వాళ్ళను… జయంతి ముందే తిట్టిపోసిందట. దీనికి జయంతి హర్ట్ అయ్యి కారులోకి వెళ్ళి ఏడ్చేసిందట. నిర్మాతను కలిసి నేను ఈ సినిమాలో నటించలేను.. మీకు ఎంత ఖర్చయ్యిందో చెప్పండి.. దానిని చెల్లిస్తాను అని ఆ సినిమా నుండీ తప్పుకుందట. అటు తరువాత కొన్నాళ్ళకు కన్నడ సినిమాలో సావిత్రిని తీసుకున్నారు.
అదే సినిమాలో జయంతి కూడా నటిస్తుంది. ఇక సెట్స్ కు వచ్చిన సావిత్రిని చూసిన జయంతి.. వెంటనే ఆమె కాళ్ళ మీద పడిపోయిందట. దానికి సావిత్రి… ‘నువ్వు ఒక స్టార్ హీరోయిన్.. నువ్వు నా కాళ్ళ మీద పడటం ఏంటి?’ అంటూ ప్రశ్నించారట. దానికి ఆమె గతాన్ని గుర్తుచేస్తూ… ఆరోజు మీరు అలా నన్ను తిట్టడం వల్లే నేను ఈరోజు తమిళం పూర్తిగా నేర్చుకున్నాను అని చేప్పిందట.దానికి సావిత్రి గారు కూడా సంతోషపడినట్టు తెలుస్తుంది. ఏమైనా జయంతిని కూడా ఈ విషయంలో చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిందే.