in

Sara Ali Khan Dating Arjun Pratap Bajwa?

బాలీవుడ్ భామ సారా అలీఖాన్ కేదార్ నాథ్ పర్యటన డేటింగ్ పుకార్లకు దారితీసింది. ఈ పర్యటనలో ఆమెతో పాటు మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వా కనిపించడం డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసినట్టైంది. సారా అలీ ఖాన్, అర్జున్ ప్రతాప్ కలిసి పుణ్యక్షేత్రంలో రాతి నిర్మాణానికి నమస్కరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సారా ఎరుపు రంగు ఫుల్ ఓవర్, తెల్లటి ప్యాంటు ధరించగా.. అర్జున్ ముదురు రంగు జాకెట్, బ్రౌన్ ప్యాంటు ధరించాడు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు చూసి నెటిజెన్స్ ఎవరికి తోచినట్లుగా వారు రియాక్ట్ అవుతున్నారు.

సెలబ్రిటీల రియల్ లైఫ్, వారి పర్సనల్ లైఫ్ మ్యాటర్స్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సారా అలీ ఖాన్ కూడా అందుకు తగినట్లుగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినవే. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సారా అలీ ఖాన్, అర్జున్ ప్రతాప్ డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..!!

Genelia D’Souza suffering with a rare disease!

Janhvi Kapoor to romance Naga Chaitanya!