in

Janhvi Kapoor to romance Naga Chaitanya!

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తన తల్లిలా సౌత్ లో నంబర్ వన్ స్థానం సంపాదించేలా ఉంది. మొదట బాలీవుడ్ కే పరిమితం అయినా, పాన్ ఇండియా సినిమాల టైంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర లో నటించి మొదటి హిట్ అందుకుంది. నెక్స్ట్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న RC16 లో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అందం అభినయం, అన్నీ ఉండి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా జాన్వీ కి బాలీవుడ్ లో ఇప్పటివరకు సరైన హిట్ దొరకలేదు. తెలుగు సినిమాకి సైన్ చేసిన దగ్గరనుంచి ఆమె క్రేజ్ పెరిగింది. హిట్ దక్కింది.

నెక్స్ట్ నాని, శ్రీ కాంత్ ఓదెలతో సినిమాలో ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి, కానీ చివరికి శ్రద్ధాకపూర్ ఫైనల్ అయ్యింది. పుష్ప 2 లో అల్లు అర్జున్ తో ఐటెం సాంగ్ చేయాల్సి ఉండగా అది కూడా క్యాన్సిల్ అయ్యింది. దీనితో తెలుగులో ఇంకేం సినిమాల్లో జాన్వీ నటించటం లేదు అనుకుంటున్న టైంలో ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది. నాగచైతన్య సినిమాలో జాన్వీ నటించనున్నట్లు  ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం చైతు తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరిలో రిలీజ్ అవుతోంది. దీని తరువాత చైతు చేయబోయే సినిమాలో జాన్వీ ఫిక్స్ అయ్యిందని సమాచారం..!!

Sara Ali Khan Dating Arjun Pratap Bajwa?

Kannada film director Guruprasad found dead!