in

Sanjay Dutt is chiru’s villain?

లయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ కు మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పోయి పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది.

తాజాగా మరో అప్ డేట్ ఈ రీమేక్ గురించి వచ్చింది. లూసీఫర్ లో విలన్ పాత్రకు గాను వివేక్ ఒబేరాయ్ నటించాడు. తెలుగులో కూడా ఆయన్నే నటింపజేయాలని మొదట అనుకున్నారు. కాని అదే పాత్రను మళ్లీ చేసేందుకు వివేక్ ఆసక్తిగా లేడట. ఈ కారణంగానే పలువురు సీనియర్ నటులను పరిశీలించారని చివరకు సంజయ్ దత్ ను ఈ చిత్రంలో నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

director sukumar’s ‘love stories’!

we do only pan india movies : charmi