పాట పుట్టిన వేళ, కొన్ని పాటలు వాటి పుట్టు పూర్వోత్తరాలు కొంత ఆసక్తిదాయకం గ ఉంటాయి, అలాగే అక్కినేని గారి “దొంగ రాముడు” సినిమాలోని ఒక పాట విషయము లో సముద్రాల రాఘవాచారి గారి ఆహారపు అలవాట్ల మీద కొంత అనుమానాలు వ్యకతం అయ్యాయి. దొంగ రాముడు సినిమాలో సావిత్రి, ఆర్, నాగేశ్వర్ రావు మధ్య సాగె” రారోయి మా ఇంటికి ” అనే పాటలో సావిత్రి గారు ఆర్ . నాగేశ్వర్ రావు గారిని ఊరిస్తూ,” నీకు ఆకలయితే సన్న బియ్యం కూడు ఉన్నది , అందులోకి అరకోడి వేపుడు ఉన్నది, రొయ్యపొట్టు చారు ఉన్నది” అని ఒక చరణం సాగుతుంది.
ఈ రెండు ఆహార పదార్ధాలు అసలు, సిసలు మాంసాహారులకు సుపరిచితం, కానీ సముద్రాల వారి కలం వెంట ఇటువంటి అసలు, సిసలు మాంసాహార వంటకాలు పలకటం తో ఇదేమిటి సుమీ! రాఘవ చారి గారికి అరకోడి వేపుడు , రొయ్యపొట్టు చారు గురించి ఎలా తెలుసు చెప్మి! అనిఅందరు చెవులు కొరుక్కున్నారట. అసలు విషయం ఏమిటంటే సముద్రాల గారు పాట మొత్తం రాసిన తరువాత ఇక్కడ రెండు మాంసాహార వంటకాల పేర్లు పడాలి అని సూరపనేని ప్రకాష్ గారికి చూపించారట, ఆ పాట ఏ మీటర్లో ఉంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా అరకోడి వేపుడు,
రొయ్యపొట్టు చారు అనే వంటకాలు జోడించారు సూరపనేని ప్రకాష్ గారు..సూరపనేని గారు మాంసాహారి కావటం తో సునాయాసంగా వాటి పేర్లు జోడించేసారు. కానీ ఆ రెండు వంటకాలు కరడు గట్టిన మాంసాహారులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది, అటువంటి మాటలు సముద్రాల గారి కలం నుంచి ఎలా వచ్చాయి అని అందరు సందేహించారు. ఆ మాంసాహార వంటల వెనుక ఉన్నది సూరపనేని ప్రకాష్ గారు అని తెలియక అపార్ధం చేసుకున్నారు. ఈ పాటలో ఆర్. నాగేశ్వర్ రావు కి వాయిస్ ఇచ్చింది కూడా సూరపనేని ప్రకాష్ గారే..