in

official: Nargis Fakhri to star in Pawan Kalyan’s ‘hhvm’!

రాక్‌‌‌‌‌‌‌‌స్టార్, మద్రాస్ కేఫ్ లాంటి సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్ హిందీ సినిమాలతో పాటు స్పై, 5 వెడ్డింగ్స్ లాంటి హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించి మెప్పించింది నర్గీస్ ఫక్రి. మధ్యలో సౌత్‌‌‌‌‌‌‌‌ వైపు కూడా అడుగేసింది. ‘సాగసం’ అనే తమిళ చిత్రంలో స్పెషల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌లో మెరిసింది. మళ్లీ ఇన్నేళ్లకు దక్షిణాదిన అడుగుపెడుతోంది. అదీ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది నర్గీస్. పవన్ బందిపోటుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్సెస్‌‌‌‌‌‌‌‌ పాత్రలో నర్గీస్‌‌‌‌‌‌‌‌ కనిపించనుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌‌‌‌‌‌‌‌గా అనౌన్స్ చేయలేదు. కానీ రీసెంట్‌‌‌‌‌‌‌‌గా నర్గీస్‌‌‌‌‌‌‌‌ కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేసింది..‘ఇదొక పీరియడ్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్. నేనింతవరకు ఇలాంటి సినిమాలో నటించలేదు. అందుకే చాలా ఎక్సయిటవుతున్నాను.

ఈ మూవీతో నాకు కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతాయని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోడానికి దొరుకుతాయనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు షూట్‌‌‌‌‌‌‌‌లో జాయినవుదామా అని ఉంది’ అని చెప్పింది నర్గీస్. అంతే కాదు.. సౌత్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీని చాలా పొగిడేసింది. ‘గతంలో సౌత్‌‌‌‌‌‌‌‌ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు రెడీగా ఉన్నాను. సౌత్ ఇండస్ట్రీ చాలా బాగుంటుందని, ఇక్కడివాళ్లు చాలా స్వీట్‌‌‌‌‌‌‌‌గా ఉంటారని, పెద్ద పెద్ద స్టార్స్‌‌‌‌‌‌‌‌ కూడా కూల్‌‌‌‌‌‌‌‌గా ఉండి అందరికీ రెస్పెక్ట్ ఇస్తారని విన్నాను. అలాంటి ఇండస్ట్రీలో పని చేసే చాన్స్ రావడం సంతోషంగా ఉంది’ అంటోంది నర్గీస్. మరి వీరమల్లుతో తెలుగునాట బిజీ అవుతుందేమో చూడాలి.

21 years for kushi!

SAMUDRALA SENIOR KI PAATA TECHINA TANTA!