in

Sameera Reddy returns to the silver screen after 13 years!

హీరోయిన్ సమీరా రెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకానొక సమయంలో ఈ చిన్నది తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఏకంగా 13 సంవత్సరాల తర్వాత సమీరా రెడ్డి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. హారర్ మూవీ “చిమ్ని” సినిమాతో ఆమె మరోసారి తన అభిమానులను పలకరించేందుకు రెడీ అయ్యారు. తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి గల ప్రధాన కారణం తన కుమారుడే అని సమీరా రెడ్డి వెల్లడించారు..

రేస్ సినిమా చూసిన తర్వాత సినిమాలలో నువ్వు ఎందుకు నటించడం లేదు అని తన కొడుకు ప్రశ్నించాడని ఆ కారణం వల్లే తాను ఇండస్ట్రీకి తిరిగి వస్తున్నానని సమీరా రెడ్డి అన్నారు. తన కొడుకు అలా ప్రశ్నించడంతో తనకు కూడా సినిమాల్లో నటించాలని కోరిక పుట్టినట్టుగా సమీరా రెడ్డి అన్నారు. సమీరా రెడ్డి చివరిగా 2012లో బాలీవుడ్ మూవీ “తేజ్” సినిమాలో నటించారు. ఇప్పుడు ఏకంగా 13 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో సమీరా రెడ్డి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..!!

tripti dimri on board for suriya – venky atluri movie?