in

samantha shifting to mumbai, buys a lavish apartment worth 15 cr?

మంతకు ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టినట్టుంది. ఫ్యామిలీమెన్ సీజన్ 2 అయ్యాక ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. కానీ కరోనా సమయం అవ్వడం, ఆ తరువాత చైతో విడాకులు, ఆ తరువాత సమంతకు అనారోగ్యం వంటి కారణాలతో బాలీవుడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చిన సమంత.. బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిందట. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయిందట.

ఈ సందర్భంగానే సమంతకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. సమంత కొత్త ఇళ్లు కొనేసిందట. ముంబైలో పదిహేను కోట్లతో ఇళ్లు కొన్నదనే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నది సమంతకే తెలియాలి. వారి పీఆర్ టీంకే తెలియాలి. కానీ సమంత మాత్రం ముంబై మీద మనసు పడ్డట్టు అర్థం అవుతోంది. ఇకపై హైద్రాబాద్‌కు పూర్తిగా గుడ్ బై చెబుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. సమంత ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది..!!

veteran actress Bhanu priya opens up about her memory loss problem!

Vijay Sethupathi, Chiyaan Vikram, Saif Ali Khan who’s tarak’s villain?