‘నా కుక్క ప్రేమకు’ సాటిలేదంటూ సమంత పోస్ట్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు నటి సమంత. ఇన్‌స్టా వేదికగా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ప్రేమను ఉద్దేశించి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తన పెంపుడు శునకం సాషాతో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు సమంత. సాషా ప్రేమ మాదిరిగా మరొక ప్రేమ లేదు అనే క్యాప్షన్ జత చేశారు. సమంత పెట్టిన పోస్టుపై నెటిజన్ల రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
నాగ చైతన్య కు కౌంటర్ గ సమంత లవ్ పోస్ట్
ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం జరిగింది. నాగ చైతన్య ప్రేమ దక్కడం తన అదృష్టమంటూ శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ పోస్టుకు కౌంటర్‌గానే సమంత ఈ పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నాగచైతన్య, శోభిత, సమంత..!!