in

samantha reveals about her depression stage!

టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్​కు ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సినిమాల నుంచి బ్రేక్ కూడా తీసుకుంది. అయితే ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. విడాకులు, అనారోగ్యం, వరుస ఫ్లాప్​ల వల్ల తాను ఎంత కుంగిపోయానో చెప్పుకొచ్చింది. ఓవైపు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంటే.. మరోవైపు తన వైవాహిక బంధం ముగిసిందని..

అదే సమయంలో తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తాను చాలా కుంగిపోయానని చెప్పుకొచ్చింది సమంత. రెండు సంవత్సరాలు ఎంత కుంగిపోయానో మాటల్లో చెప్పలేనంటూ ఎమోషనల్ అయింది. ఆ సమయంలోనే తనలా లైఫ్​లో ఇబ్బందులు ఎదుర్కొని.. పోరాడి గెలిచిన వారి సమస్యల గురించి తెలుసుకుని..వారి గురించి పుస్తకాలు చదివానని చెప్పింది. అది తనకు చాలా సహాయ పడిందని వెల్లడించింది. తన లాంటి వాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారనియ. వారంతా తనలాగే పోరాడే శక్తిని పొందాలని ఆశిస్తున్నానంటూ సమంత భావోద్వేగానికి గురైంది..!!

Payal Ghosh Expresses Desire To Marry Mohd Shami!

babai abbai clash onscreen again?