in

samantha: ‘Raa Macha Macha’ of Game Changer is ‘Unmatchable’!

గేమ్‌ ఛేంజర్‌’ ఈ చిత్రం నుంచి ‘రా మచ్చా మచ్చా’ అంటూ కొనసాగే లిరికల్‌ పాటను సోమవారం విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం రామ్‌చరణ్‌ అభిమానులను అలరిస్తోంది. ఇదిలా వుండగా ‘రా మచ్చా మచ్చా’ పాటలో చరణ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌కు కథానాయిక సమంత ఫిదా అయిపోయింది. నీకెవరూ సాటిరారు.. అంటూ అన్‌మ్యాచ్‌బుల్‌ అని మెన్షన్‌ చేస్తూ..ఫార్మల్‌ ప్యాంట్‌ , షర్డ్‌తో ఇలా ఎవరైనా డ్యాన్స్‌ చేయగలరా అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. గతంలో రామ్‌చరణ్‌, సమంత ‘రంగస్థలం’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సమంతతో పాటు రామ్‌చరణ్‌ అర్ధాంగి ఉపాసన కూడా మిస్టర్‌ సీ మీ డ్యాన్స్‌తో హై ఓల్టెజ్‌ పుట్టించారని రామ్‌చరణ్‌ చేసిన పోస్ట్‌కు స్పందించారు..!!

JR NTR Prashanth Neel to Have Bangladesh Backdrop?

arjun reddy girl shalini pandey to romance dhanush!