in

samantha joins mirzapur fame ali fazal for a fantasy drama!

పుష్ప ఐటమ్ సాంగ్ తరువాత ఇండియా మొతం సమంత పేరు మారు మోగిపోయింది..ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొని మరిన్ని పాన్ ఇండియా సినిమాలు లేదా ఐటెం సాంగ్స్ చేస్తుంది అనుకున్నారంతా..కానీ హెల్త్ బాలేక యాక్టింగ్ తగ్గించి ఇంటికే పరిమితం అయ్యింది..ఇప్పుడు సామ్ మళ్ళి స్పీడ్ పెంచింది కానీ ఓన్లీ వెబ్ సిరీస్ల మీదనే ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. సామ్ రీ ఎంట్రీలో వెబ్ సిరీస్ లకే ప్రాధాన్యత ఇస్తోంది. ఫామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న సామ్ అదే నిర్మాతలతో పలు వెబ్ సిరీస్ లకి కమిట్ అవుతోంది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీటా డెల్ కి రీమేక్ వస్తున్న ‘హానీ బనీ’ లో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

మళ్ళీ రాజ్ అండ్ డీకే నిర్మాణంలో ఇంకో వెబ్ సిరీస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఈ సిరీస్ కి తంబాడ్ ఫేమ్ రవి అనిల్ బర్వె తెరకెక్కిస్తున్నారు. మొన్నటివరకు ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ మెయిన్ లీడ్ అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పాత్రలోకి మీర్జా పూర్ ఫేమ్ ఆలీ ఫైజల్ వచ్చి చేరాడు. ఆలీ ఫైజల్ ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినా రాని  గుర్తింపు మీర్జా పూర్ ద్వారా వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఓటీటి లోనే తన అదృష్టం పరిక్షించుకుంటున్నాడు. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సామ్, ఆలీ ఫైజల్ తో చేయటం గ్రేట్ అనే చెప్పాలి..!!

Choreographer Bosco Martis says Jr NTR is a fabulous dancer!

king Nagarjuna To Play villain In Rajinikanth’s Coolie?