in

samantha: i am mentally very strong now

వచ్చే నెల నుంచి సామ్ కొత్త సినిమాలతో బిజీబిజీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్య్వూ ఇచ్చారు. తాను మునుపటి కంటే ఎంతో స్ట్రాంగ్‌ అయినట్లు తెలిపారు. జీవన శైలిని మార్చుకోవడం ద్వారానే తానలో మార్పులు సాథ్యం అయ్యాయని అన్నారు. ‘తమలోని బలహీనతల్ని అధిగమించేందుకు అంతా ప్రయత్నిస్తారు. కానీ మన మనసు అందుకు ఒప్పుకోదు. వాటి నుంచి బయటపడనివ్వదు. అలాంటప్పుడు ఆధ్యాత్మికతను మించిన మార్గం లేదు.’ అంటూ సమంత చెప్పుకొచ్చారు.

గత మూడేళ్ల నుంచి సమంతకు ఎదురైన సమస్యల నుంచి ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక మార్గాన్నే ఎంచుకున్నట్లు తెలిపారు. అందుకనే ఇప్పుడు మానసికంగా తాను ఎంతో బలంగా మారినట్లు చెప్పారు. తను చేయబోయే కొత్త సినిమా గురించి కూడా తెలిపారు. తన పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయన్నారు. మహిళలు సినిమాల్లో ఎలాంటి పాత్రలనైనా పోషించగలరని నిరూపించడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా ఉండే పాత్రలనే చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు..!!

Allu arjun’s shocking New look without a beard: Pushpa 2 to be delayed?

for the first time naga chaithanya’s dual sensation!