ఆత్మ గౌరవానికి, నటనకు మారు పేరు అనిపించుకున్న గత కాలపు నటి భానుమతి గారు, ఒకానొక సందర్భం లో, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వర రావు గారికి పాదాభివందనం చేసి క్షమాపణలు కోరారు,ఎప్పుడు? ఏమిటి ఆ సందర్భం. అవి ” మల్లీశ్వరి” సినిమా పాటలు రిహార్సల్ జరుగుతున్న రోజులు, ” మనసున మల్లెల మాలలూగెనే” పాట రిహార్సల్ సందర్భం గ తన పాటలు తానే పాడుకొనే భానుమతి గారు సాలూరి గారు చెప్పిన విధముగా కాకుండా తనకు నచ్చిన విధంగా పాడుతున్న భానుమతి గారిని వారించిన వినకుండా, నాకు కూడా సంగీతం తెలుసు మాస్టారు అన్నారట. ఆ మాటకు కోపం వచ్చిన సాలూరి గారు తన హార్మోనియం తీసుకొని వెళ్లిపోయారట.
విషయం తెలుసుకున్న బి.యెన్. రెడ్డి గారు వెళ్లి సాలూరి గారిని బతిమాలి తీసుకొని వచ్చారట. సాలూరి గారు చెప్పిన విధం గానే ఆ పాటను భానుమతి గారు పాడారు. రికార్డింగ్ పూర్తి అయింది సినిమా రిలీజ్ అయి మంచి క్లాసికల్ మూవీ గ ప్రశంసలు అందుకున్నది. ఆ పాటను విన్న భానుమతి గారు, సందర్భానికి తగిన భావప్రకటన కు ముగ్ధురాలయిన ఆవిడ సాలూరి గారికి పాదాభివందనం చేసి నన్ను క్షమించండి గురువు గారు అని పశ్చాతాప పడ్డారట. తెలుగు చిత్ర సీమలో మొదటి తరం సంగీత దర్శకులలో సాలూరి రాజేశ్వర రావు గారు తిరుగులేని మేటి సంగీత దర్శకుడిగా పేరు పొందారు..