in

salman khan locks pooja hegde for 90 days!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బీజీ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అనే చెప్పవచ్చు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు చేసిన సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ అవ్వడంతో దర్శక, నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు అడపా దడపా ఇతర భాషల సినిమాలకు కూడా ఓకే చెబుతోంది ఈ బ్యూటీ. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయనుంది మన బట్ట బుమ్మ.

తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లగా.. చిత్రీకరణ కోసం 90 రోజుల పాటు డేట్స్ కేటాయించింది. ముంబయికి చేరువలోని కర్జాత్‌లో ఈ మారథాన్ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించాడట. ఈ కారణంగా పూజా కూడా ఈ షెడ్యూల్ కోస 90 రోజులు కేటాయింటినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే వచ్చే రెండు, మూడు నెలలు పూజా ఈ ప్రాజెక్టు కోసం పనిచేయనుందని తెలుస్తోంది.

సల్మాన్-పూజా హెగ్డే సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా.. కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది. వచ్చే నెలలో ఈ భారీ షెడ్యూల్‌లో సల్మాన్‌తో కలిసి పనిచేయనుంది బుట్ట బొమ్మ. పూజా ఇప్పటికే బాలీవుడ్ కొన్ని చిత్రాల్లో నటించింది. 2016లో హృతిక్ రోషన్ సరసన మొహంజదారో చిత్రంలో కనిపించిన ఈ భామ.. అనంతరం హౌస్‌ఫుల్ -4లో అక్షయ్ కుమార్‌తో పనిచేసింది.ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి..

Aamani’s niece Hrithika set to star in ‘Nari Nari Naduma Murari’!

Chandni Bhagwanani cute Stills in Pink Lehenga!