in

saif ali khan opened up about working with Prabhas!

టిసిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.“ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

“ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది. రావణాసురుడి ప్రాతలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఒక ఇంటర్వ్యూ లో సైఫ్ మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం అనీ , కొద్ది రోజులుగా అతడిని దగ్గర్నుంచి చూస్తున్నాననీ , మామూలుగా చూస్తే అతను తనకు ఓ “బాహుబలి”లా కనిపిస్తారనీ , షాట్ ప్రారంభమయ్యే సమయానికి రాముడిగా మారిపోతారనీ , సెట్‌లో ఎప్పుడూ సరదాగా, ఉల్లాసంగా ఉంటారనీ , మేమిద్దరం కలిసి మెలిసి పనిచేశామనీ , వ్యక్తిగా చెప్పాలంటే ప్రభాస్ జెంటిల్మెన్, చాలా మంచి మనసున్న వ్యక్తి`అనీ సైఫ్ ప్రశంసించారు.

shraddha das latest photoshoot stills!

Prakash Raj Resigns To His MAA Membership!