సాయి పల్లవి రికార్డు రెమ్యూనరేషన్
సాయి పల్లవికి సంభంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హిందీ రామాయణ్ కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది అని టాక్ ఇప్పటివరకు 4 నుంచి 5 కోట్లు తీసుకునే సాయి పల్లవి ఇప్పుడు రామాయణ్ కోసం ఏకంగా 30 కోట్లు తీసుకుంటోంది అని టాక్. రామాయణ్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఒక్కో పార్ట్ కి 15 కోట్లు చొప్పున 2 పార్ట్స్ కి 30 కోట్లు తీసుకుంటోదట. పల్లవి సక్సెస్ రేటు చూసిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం..
హిందీ రామాయణ కోసం కోట్లు తీసుకుంటున్న సాయి పల్లవి
ఇప్పటివరకు హైయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరుండగా ఇప్పుడు ఈ ప్లేస్ లోకి సాయి పల్లవి చేరింది. నయన్ మొదటి బాలీవుడ్ డెబ్యూ జవాన్ కోసం 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా. సాయి పల్లవి రామాయణ్ కోసం 30 కోట్లు అందుకుంటోంది. ఒక సౌత్ హీరోయిన్ బాలీవుడ్ లో ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవటం గొప్ప విషయంఅని చెప్పాలి. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా ఇంత రెమ్యునరేషన్ లేదు..!!