in

Sai Pallavi joins Kamal Haasan’s upcoming production venture!

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు భాషలలో “గార్గి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఇప్పుడు మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ స్టార్ కమల్ హాసన్ స్వంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్, సోనీ పిక్చర్స్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం లో శివ కార్తికేయన్ హీరోగా ” #SK21″తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో శివ కార్తికేయన్ కు జోడీగా సాయి పల్లవి ఎంపిక అయ్యారు. ఈ మూవీ లో రష్మిక మరో కథానాయికగా నటిస్తుండగా హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

i reduced weight by 15 kgs staying at home : kriti sanon

ananthapur beauty Priyanka Jawalkar latest photoshoot!