సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించబోతున్న ఎల్లమ్మ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేసినట్టు సినీ వర్గాల టాక్. సాధారణంగా కథల విషయంలో సాయిపల్లవి సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే చేయడానికి ఇష్టపడుతుంది. దీంతో ఎల్లమ్మ పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది.
వేణు బలగం చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. దీంతో తదుపరి చిత్రంగా ఎల్లమ్మను తెరకెక్కించబోతున్నారు. వేణు ఎప్పటినుంచో ఈ సినిమా చేయాలని హీరోలందరికీ కథ చెబుతూ ఉన్నాడు. మొదట ఈ కథను నానికి వినిపించారని..స్టోరీ నచ్చకపోవడంతో నాని నో చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత శర్వానంద్, తేజ సజ్జా, హీరో నితిన్‌కి వినిపించగా.. నితిన్ ఒకే చెప్పారని సమాచారం. ఇక నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు..!!