in

sai pallavi gives a green signal for a remake?

రీమేక్ సినిమాల్లో నటించకూడదు.. అని సాయి పల్లవి తీసుకున్న నిర్ణయం ఆమెని కెరీర్ నుంచి దూరంగా ఎక్కడికో నెట్టేసింది. ‘భోళా శంకర్’ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆ తప్పు ఆమె కెరీర్‌ని వెంటాడుతూనే వుంది. ఇకపై అలాంటి తప్పు చేయకూడదని సాయి పల్లవి నిర్ణయించుకుందట. అందుకు కారణం ఇప్పుడు రీమేక్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోవడమే. ముఖ్యంగా తెలుగులో రీమేక్ సినిమాల జోరుగా బాగా పెరిగింది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్ హీరోలంతా రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్ వంటి స్టార్సే రీమేక్స్‌‌పై ఫోకస్ పెట్టినప్పుడు తానెంత.? అనుకుందో ఏమో.! సాయి పల్లవి మనసు మార్చుకుందట. ఈ క్రమంలోనే తాజాగా ఓ రీమేక్ మూవీకి సాయి పల్లవి సైన్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఓ మలయాళ సినిమా అనీ తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుందట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్..!!

happy birthday balakrishna!

Urvashi Rautela the new hot sensation of tollywood!