in

sai dharam tej to marry her favorite heroine?

హీరో, హీరోయిన్స్ కలిసి నటించేటప్పుడు వారి మధ్య ఏదో ఉంది అనే పుకార్లు రావటం సహజం.  అదే కాంబినేషన్ ఎక్కువసార్లు రిపీట్ అయితే కచ్చితంగా వారి మధ్య ఎదో ఉంది అని కన్ఫర్మ్ చేసేస్తారు గాసిప్ రాయుళ్ళు. అలాంటిదే సాయి తేజ్, రెజీనా లవ్ స్టోరీ. సాయి తేజ్ సెకండ్ సినిమా పిల్ల నువ్వు లేని జీవితం. ఈ సినిమాలో మొదటిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు.

అప్పుడు ఏర్పడిన స్నేహం తరవాత ప్రేమగా మారింది అనేది టాక్. ఈ రూమర్లకు తగ్గట్టుగానే నెక్స్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నక్షత్రం అనే రెండు సినిమాల్లో కలిసి నటించింది ఈ జోడీ. అప్పటిలో వీరిద్దరి లవ్ స్టోరీ గూర్చి మీడియా కథలు కథలుగా రాసింది. కానీ వీళ్లు ఎప్పుడు వీటిని ఖండించలేదు. తరవాత పెళ్లి అన్నారు. బ్రేకప్ అన్నారు. వేటికీ వీరి నుంచి వివరణ లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి  పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. సాయి తేజ్, రెజీనా పెళ్లి వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!!

Pooja Hegde and Rohan Mehra added fuel to their dating rumors!

f cube ‘Siddhu Jonnalagadda’!