శేఖర్ కమ్ముల , ” ఫిదా ” సినిమా లో భానుమతి సింగల్ పీస్ కి తండ్రిగా నటించింది ఎవరు అంటే “సాయి చంద్” అని టక్కున చెపుతారు అందరు, కాని వాళ్ళ నాన్న గారైన త్రిపురనేని గోపీచంద్ గారు ఆయనకు పెట్టిన పేరు వేరే ఉంది. సాయి చంద్ గారు పుట్టినపుడు ఏడవలేదట, ఆ టైం లో గోపీచంద్ గారు నాస్తికవాదం వీడి, ఆస్తికవాదం వైపు అడుగులేస్తున్నారు. ఇంట్లో ఉన్న సాయిబాబా విగ్రహం ముందు నిలుచొని నా బిడ్డను ఎలాగైనా బ్రతికించమని వేడుకొనగానే, బిడ్డ ఏడవటం మెదలెట్టాడట, అందుకే ఆ బిడ్డకు తండ్రి పేరు ,బాబా పేరు కలసి వచ్చేట్లుగా “రామకృష్ణ సాయిబాబా” అని నామకరణం చేసారు.
ఆ తరువాత కొంత కాలనీ కి ఆంధ్ర బాలానందం సంఘం లో చేరిన ఈ పిల్లవాడు,” ఈజి చైర్” అనే నాటకం లో భూతవైద్యుడి వేషం వేసి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాడు. ప్రముఖ నాస్తిక ఉద్యమకారుడు గోరా గారు స్థాపించిన వాసవ్య గురుకుల పాఠశాల లో చేరిన ఈ రామకృష్ణ సాయిబాబా అనే కుర్రవాడికి, గోరా గారి కోడలు హేమలత లవణం గారు అతని నాన్న గారి పేరు కలసి వచ్చేలాగా ” సాయి చంద్” అనే నామకరణం చేసారు. ఆ తరువాత నరసింగ రావు గారు గౌతమ్ ఘోష్ డైరెక్షన్ లో నిర్మించిన ” మా భూమి ” సినిమా లో హీరో గ చిత్ర రంగ ప్రవేశం చేసి “సాయి చంద్” గ కోన సాగుతున్నారు..