కుడి ఎడమయితే పొరబాటు లేదోయ్ అన్నట్లు, హీరోలు విలన్లు అవటం, విలన్లు హీరోలు అవటం చాల సహజం సినీ రంగంలో. ఆ కోవకు చెందిన వారే ఒకప్పటి విలన్, కన్నడ ప్రభాకర్, 14 ఏళ్ళ వయసులోనే కన్నడ సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన ప్రభాకర్, విలన్గ, హీరో గ, నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు, మన తెలుగు పరిశ్రమ వారు మాత్రం అతనికి విలన్ రోల్స్ ఇచ్చి ఆదరించారు. మంచి ఫీజిక్ తో, డిఫ్రెంట్ డైలాగు డెలివరీ తో అగ్ర స్థాయి విలన్ గ వెలుగొందారు. హీరోలకు సెంటిమెంటల్ గ కన్నడ ప్రభాకర్ లక్కీ విలన్ అయ్యారు, మంచి గుర్తింపు పొందారు. చిరంజీవి, నాగార్జున సినిమాలలో ఎక్కువగా నటించారు. కన్నడ ప్రభాకర్ ఒకానొక సమయం లో తన రెండు కాళ్ళు తీసేయ వలసిన పరిస్థితులకు వెళ్లారు, కాళ్ళు కోల్పోయి జీవించటం కంటే మరణించటం మంచిది అని తలచిన ప్రభాకర్ అందుకు అగీకరించక, చివరకు మరణించారు..
చిన్న వయసులోనే నేమ్,ఫేమ్, మనీ మూడు పొందిన ప్రభాకర్ మద్యం , ధూమపానం వంటి వ్యసనాలకు బానిస అయ్యారు, దాని కారణం గ మధ్య వయసులోనే అనారోగ్యం పాలయ్యారు, దాని కారణంగా రెండు కాళ్ళు పని చేయకుండా పోయాయి, వాటిని తొలగిస్తే బృతుకుతావు, లేదంటే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పిన లెక్క చేయకుండా, ఇంత బతుకు బతికి అవిటి వాడిగా జీవించటం కంటే, మరణించటమే మేలని మొండిగా, అలాగే వైద్యం చేయించుకోకుండా మరణించారు కన్నడ ప్రభాకర్. ఎంత వ్యసన పరుడు అయినా ప్రభాకర్ మెండుగా దాన గుణం కలిగిన వారు, అయన చనిపోయిన తరువాత అయినను చూడటానికి, వేలమంది ఆనాధలు, వృద్దులు తరలి వచ్చారు, అప్పుడు తెలిసింది అందరికి, ఆయన ఎన్ని గుప్త దానాలు చేసారో. వ్యసనాలు భౌతికంగా ఆయనను మింగేసిన, ఆయన దాతృత్వం ఆయనను కొంతమంది గుండెల్లో అయినా నిలిచి పోయేట్లు చేసింది..!!