in

SAAHO DIRECTOR FOR CHATHRAPATHI REMAKE?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో చత్రపతి సినిమా రీమేక్ అవ్వబోతుంది అంటూ వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఇప్పటికే రీమేక్ కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేసిందంటున్నారు. తన డబ్బింగ్ సినిమాలతో హిందీలో మంచి పాపులారిటీని దక్కించుకున్న బెల్లంకొండ చత్రపతి సినిమాతో ఖచ్చితంగా అక్కడ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారట.

ఈ భారీ సినిమాకు దర్శకుడు కూడా తెలుగు దర్శకుడే అంటూ సమాచారం అందుతోంది. బాలీవుడ్ ప్రేక్షకులను సాహోతో సర్ ప్రైజ్ చేసిన సుజీత్ కు చత్రపతి హిందీ రీమేక్ బాధ్యతలను అప్పగించే విషయమై సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే రెడీ అయిన స్ర్కిప్ట్ ను ఆయన చేతిలో పెట్టబోతున్నారనే వార్తలు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టేస్ట్ కు తగ్గట్లుగా సుజీత్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చత్రపతిని రీమేక్ చేయగల సత్తా సుజీత్ కు ఉందంటూ అంతా నమ్మకంగా ఉన్నారట.

BALAYYA SENSATIONAL COMMENTS ON CORONA vaccine!

Aakasam Nee Haddu Raa!