రంగస్థల నటులకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లే వారి నటనకు కొలమానం గ భావిస్తారు, వారు ఒన్స్ మోర్ అంటే రెచ్చిపోయి మళ్ళీ అదే పద్యాన్ని పాడేస్తారు అదే ఇన్స్టంట్ రియాక్షన్. కానీ సినీ నటులకు అటువంటి అవకాశం ఉండదు, సెట్ లో ఉన్న వాళ్ళందరూ వారికీ నచ్చిన, నచ్చకపోయినా, చప్పట్లు కొడతారు, పగలపడి నవ్వుతారు కానీ, అది నిజం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన ఎస్.వి.ఆర్. కి ఒక వింత అలవాటు ఉండేది తాను సీన్ పూర్తి చేయగానే, ప్రక్కనే ఉన్న లైట్ బాయ్ నో, ట్రాలీ బాయ్ నో” ఇది ఎప్పిడి ఇరికో, రంగ రావు పర్వ ఇల్లియా ” అంటూ అడిగే వారు, నల్ల ఇరుక్కు సర్ అనో,సూపర్ సర్ అంటే తృప్తి పడే వారు.
సంపూర్ణ రామాయణం చిత్రం షూటింగ్ లో రావణ పాత్ర పోషిస్తున్న ఎస్.వి.ఆర్. ఒక పెద్ద సీన్ యాక్ట్ చేసి, ప్రక్కనే ఉన్న లైట్ బాయ్ ని “ఎన్న అప్ప, ఎప్పిడి ఇరికే, రంగ రావు పరవా ఇల్లియా” (ఏమయ్యా రంగ రావు ఫరవా లేదా) అని అడిగారట, వెంటనే అతను “ఎన్నమో సర్, అంద రంగ రావు కాణమే ఇల్లే” ( ఏమో సర్ ఆ రంగ రావు కనపడ లేదు) అన్నాడట, అది విన్న రంగ రావు డైరెక్టర్ ఒకే చెప్పిన వినకుండా, వన్ మోర్ అంటూ ఆ సీన్ మళ్ళీ చేశారట , మళ్ళీ అతనినే అడిగారట “ఇది ఎప్పిడి ఇరికే” (ఇది ఎలా ఉంది) అని, అతను” ఇప్పో నమ్మ రంగ రావు వందాచి సర్”, ( ఇప్పుడు మా రంగ రావు వచ్చాడు) అన్నాడట. రంగ రావు నటనే కాదు ఆయన వ్యవహార శైలి కూడా విలక్షణం అయినది అనటానికి ఇదొక ఉదాహరణ..!!