in

S.V.R mecchina SWARAM!

వరస నట సార్వభౌమ, డైలాగు కింగ్ ఎస్.వి.రంగా రావు మెచ్చిన స్వరం ఎవరిది? సినీ రంగ ప్రవేశం మొదటి రోజుల్లో నీ వాయిస్ బాగో లేదు అని వేరే వారి చేత దుబ్బింగ్ చెప్పించిన నటుడి డైలోగ్స్, ఆ తరువాత రోజుల్లో, గ్రాంఫోన్ రికార్డు గ రిలీజ్ అయి రికార్డు సృష్టించిన నటుడు ఎవరు? హలో! హలో! హలొ! ఇరిటేట్ కాకండి, ఆయనెవరో కాదు మన రావు గోపాల రావు గారే. కాకినాడ లో తరచూ రావు గోపాల రావు నాటకాలను చూసే వారు ఎస్.వి.ఆర్. అయన నటనకు, వాయిస్ కి అభిమానిగా మారిన ఎస్ .వి.ఆర్. “నేను నీ అభిమానినయ్యా” అని బహిరంగంగానే చెప్పే వారు. రావు గోపాల రావు చేత సినీ రంగ ప్రవేశం చేయించింది కూడా ఏస్. వి.ఆర్. గారే. ఆ తరువాత “జగత్ కిలాడీలు” చిత్రం లో విలన్ గ ఎస్.వి.ఆర్ కాంబినేషన్ లో నటించారు రావు గోపాల రావు.

ఆ సమయం లో రావు గోపాల్ రావు నటనను నిశితం గ గమనించిన ఎస్.వి.ఆర్. “కళ్ళు మాట్లాడటం లేదు దొరా! కళ్ళను మాట్లాడించు” అంటూ సలహా ఇచ్చే వారట. ఎస్.వి.ఆర్. అంత గ మెచ్చుకున్న వాయిస్ బాగో లేదన్న డిస్ట్రిబ్యూటర్స్ కోసం , వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించారు, ఆ చిత్ర నిర్మాత రాఘవ గారు. ఈ సంఘటన రావు గోపాల రావు గారిని చాలా బాధించింది. ఒక రోజు ఎస్.వి.ఆర్, రావు గోపాల రావు ను వాహిని స్టూడియో కి పిలిపించారు,అక్కడ నుంచి నేరు గ శివాజీ గణేశన్ ఇంటికి తీసుకెళ్లి, ఒక సారి మన వాడి వాయిస్ విను అని రావు గోపాల రావు తో కొన్ని డైలోగ్స్ చెప్పించారట, మీ వాయిస్ చాలా బాగుంది అని తెగ మెచ్చుకున్నారట శివాజీ గారు. ఆ తరువాత నటుడు కాంత రావు నిర్మించిన ” గండర గండడు” చిత్రం లో రావు గోపాల రావు కు వేషం ఇవ్వటమే కాకుండా అయన చేత డైలోగ్స్ చెప్పించారు.

ఇక అప్పటి నుంచి అందరు నిర్మాతలు ఆయన చేతే డైలోగ్స్ చెప్పించటం మొదలు పెట్టారు. ముత్యాల ముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ గ ఆయన నోట పలికిన డైలోగ్స్ ప్రత్యేక రికార్డు గ రిలీజ్ చేసారు. మొట్ట మొదటి డైలోగ్స్ రికార్డు గ రికార్డు సృష్టించారు రావు గోపాల రావు. అంతకు ముందు కేవలం పాటలు మాత్రమే రికార్డు రూపం లో వచ్చేవి, ఇదే మొట్ట మొదటి డైలోగ్స్ రికార్డు. మొదట్లో అయన స్వరం బాగోలేదన్న వారే అయన స్వరానికి పట్టం కట్టారు. మిమిక్రి ఆర్టిస్టుల పాలిట వరం అయ్యారు రావు గోపాల రావు, ఆయన డైలోగ్స్ పలకని మిమిక్రి ఆర్టిస్ట్ లేడంటే నమ్మండి. తెగిడిన వారి చేత, పొగిడించుకోవటం అంటే ఇదే మరి!!!

Das Ka Dhamki!

samyuktha menon shares dissatisfaction with the production house!