in

rukmini vasanth hints being caste in ntr neel movie!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో అలాంటి హీరో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది నిన్నటిదాకా ఒక స్పెషల్ డిస్కషన్ అయ్యింది. కన్నడ భామ రుక్మిణి వసంత్ ఆ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు..

ఐతే తాజాగా రుక్మిణి వసంత్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. టైగర్ ప్రింట్ ఉన్న షర్ట్ తో సెల్ఫీ తీసుకుంది రుక్మిణి వసంత్. అది ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ స్పాట్ లోనే అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. తాను తారక్ తో నటిస్తున్నా అన్న విషయాన్ని హీరోయిన్ ఇలా రివీల్ చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా రుక్మిణి వసంత్ కి ఇదొక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ మాస్ స్టామినా తెలిసిందే. అయనతో జత కడుతుంది కాబట్టి రుక్మిణికి కూడా నేషనల్ లెవెల్ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది..!!

catherine tresa becomes lucky girl for icon star!

happy birthday vijaya shanthi!