in

RRR star Jr NTR possible contender for Oscars?

ఏడాది టాలీవుడ్ గొప్ప చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒక‌టి. ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ ఈ అద్భుత దృశ్య‌కావ్యానికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ఈ చిత్రంలో ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల న‌ట‌న వ‌ర్ణ‌నాతీతం. ముఖ్యంగా తార‌క్ న‌ట‌న‌కు హాలీవుడ్ ప్ర‌ముఖులు సైతం జైజైలు ప‌లికారు. కొమురం భీం పాత్ర‌లో తార‌క్ న‌టించాడు అన‌డం కంటే జీవించాడు అన‌డం స‌బ‌బు. బీభ‌త్సం, రౌద్రం, ప్రేమ‌, క‌రుణ‌ వంటి రసాల‌ను క్ష‌ణాల్లోనే మార్చి.. వాటిని అద్భుతంగా ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల చేత ఔరా అనిపించాడు. ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు తార‌క్‌ను సింగిల్ టేక్ ఆర్టిస్టు అంటూ వ‌ర్ణించిన విష‌యం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్‌ పేరు ఆస్కార్ లిస్ట్‌లో చేరింది..

అమెరికాకు చెందిన‌ ప్ర‌ముఖ మూవీ పబ్లికేష‌న్స్ ‘VARIETY’ వారు ఆస్కార్‌-2023కి గాను ఉత్త‌మ న‌టుడు కేట‌గిరీలో పోటీగా ఉన్న న‌టుల పేర్ల‌ను ప్ర‌చురించింది. ఈ లిస్ట్‌లో తార‌క్ పేరు కూడా ఉంది. ఆసియా నుండి ఈ లిస్ట్‌లో ఉన్న ఎకైక న‌టుడు ఎన్టీఆర్ కావ‌డం విశేషం. ఈ విష‌యం తెలిసిన తార‌క్ అభిమానులు సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లై సంచ‌ల‌నం విజ‌యం సాధించింది. టాలీవుడ్‌లో మొదటి సారి 100కోట్ల షేర్‌ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓవ‌రల్‌గా 1200కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్‌లు సాధించి రాజ‌మౌళికి వ‌రుస‌గా రెండోసారి 1000 కోట్ల క్ల‌బ్‌లో నిలిచిన‌ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది..!!!

Malayali girl Anupama Parameswaran In DJ Tillu 2!

vijay opens up about ‘liger’ and ‘Amma Nanna Tamil Ammayi’!