in

RRR’ Actor Ray Stevenson(scott dora) Dies At 58!

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధాన విలన్‌ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) సోమవారం మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ లో స్కాట్ దొరగా రే స్టీవెన్సన్ చక్కటి విలనిజం పండించారు. ఇక హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మృతి పట్ల ఆర్ఆర్‌ఆర్‌ టీం కూడా సంతాపం తెలిపింది..!!

HAPPY BIRTHDAY CHANDRA MOHAN!

Case booked against Tollywood actress Dimple Hayathi!