in

ROWDY STAR TO PLAY SOLDIER IN SUKUMAR’S NEXT?

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా అనౌన్స్ అయ్యింది. సుకుమార్‌, విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టేలానే ఉంది. ఎందుకంటే, విజయ్ దేవరకొండ కమిట్ అయిన రెండు సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. అలాగే సుకుమార్ కూడా బన్నితో పుష్ఫ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ కమిటెడ్ సినిమాలను పూర్తి చేసిన తర్వాత విజయ్ దేవరకొండ, సుక్కు సినిమా స్టార్ట్ అవుతుంది.

అంటే ఎలా లెక్కలేసుకున్నా 2022లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఈయనకు ఇదే తొలి చిత్రం. కాగా.. ఈ సినిమాను సుకుమార్ తనదైన స్టైల్లో పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తాడట..ఇందులో విజయ్ దేవరకొండ సైనికుడిగా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే చాలా రోజులు వెయిటింగ్ తప్పదు మరి..

Namrata Shirodkar Shares Glimpses From Her ‘veggie Farm’!

balayya new movie is titled ‘Balaramayya Bariloki Digithe’!