రొమాంటిక్’లో ఆమె మోనిక అనే అమ్మాయిగా నటించింది. “ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్ర అది. ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. నా మొదటి చిత్రమే పూరి బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది,” అని అంటోంది. అన్నట్లు ఈ సినిమాలో ఆమె ఒక పాట కూడా పాడింది. “నా వల్లే కాదే అనే పాటను పాడాను.” హీరో ఆకాష్ తో మంచి స్నేహం కూడా కుదిరిందట.
“హీరో ఆకాష్ మంచి వాడు. అతని రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమా వల్ల,” అని తెలిపిందికేతిక..మొదటి సినిమా విడుదలకు ముందే ఆమెకి తెలుగులో ఇతర చిత్రాల్లో పాత్రలు దక్కాయి. “పూరి గారు ఓ అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారంటే.. కచ్చితంగా ఏదో టాలెంట్ ఉందని అంతా అనుకుంటారు. అందుకే నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను,” అని చెప్పిందికేతిక.