మెగాస్టార్ చిరంజీవి – నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా తెరపై కనిపించబోతున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇదే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించబోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమాలో రోజాతో స్పెషల్ రోల్ చేయించేలా పక్కాగా ప్లాన్ చేశారట చిరంజీవి.
ఈ మేరకు రోజాతో డీల్ కుదుర్చుకున్నట్లు ఫిలిం నగర్‌లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఇదే బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాణంలో అతిత్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు.