in

rgv’s announced ‘corona virus’ release date!

రోనాని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అందులో భాగంగానే ధియేటర్లు కూడా మూతపడ్డాయి. తాజాగా కేంద్రం అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50 % సిట్టింగ్ తో తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో ఆరు నెలల తర్వాత మళ్ళీ ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తమ సినిమాలను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగానే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి సినిమా తనదేనని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ” మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అంటూ వర్మ వెల్లడించాడు.

anil ravipudi plan for ‘f3’ shooting!

Trisha reveals her life turning point!