in

rgv captures ashu reddy pic in a romantic way!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఆయ‌న చ‌ర్య‌లు ఊహాతీతం. ఎవ‌రికి ఓ ప‌ట్టాన అర్ధం కావు. ఆయ‌న చేసే సినిమాలు, వాటికి సంబంధించిన‌ ప్ర‌మోష‌న‌ల్ స్టంట్స్ అన్ని విచిత్రంగానే ఉంటున్నాయి. ఇక ఈయ‌న క్రేజ్‌ని క్యాష్ చేసుకొని చాలా ఫేమ‌స్ కావాల‌ని బుల్లితెర న‌టీమ‌ణులు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. వ‌ర్మ వ‌ల్ల‌నే అరియానా బిగ్ బాస్ షోకి వెళ్లి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

ఇప్పుడు అదే బాట‌లో ఫేమ‌స్ కావాల‌ని కొంద‌రు భామ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా జూనియ‌ర్ స‌మంత‌గా ఫేమ‌స్ అయి బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అషూ రెడ్డి .. వ‌ర్మ‌ని ఇంట‌ర్వ్యూ చేసేందుకు వెళ్లింది. చిట్టిపొట్టి దుస్తులు ధరించి హాట్‌గా అత‌ని ద‌గ్గ‌ర‌కు వెళ్లగా, వ‌ర్మ త‌న‌లో దాగి ఉన్న వేరే కోణాన్ని బ‌య‌ట పెట్టాడు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో అషురెడ్డిని లో యాంగిల్‌లో ఫొటోలు, వీడియోలు తీసాడు.

దీనిపై నెటిజ‌న్స్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.వర్మ‌కు ఇలాంటి విమ‌ర్శ‌లు కొత్తేమి కాదు కాని, అషూ కూడా వీటిని లైట్‌గా తీసుకొని వెటకారంగా ‘మీ కామెంట్స్‌కు థ్యాంక్స్’ అని రిప్లై ఇచ్చింది.మొత్తానికి ఆర్జీవి వ‌ల‌న ఈ అమ్మ‌డు మ‌రింత ఫేమ‌స్ అయింది. ఆర్జీవీని హాట్ హాట్ డ్రెస్ ధరించి ఇంటర్వ్యూ చేస్తే మరింత ఫేమస్ అవ్వొచ్చన్న ఆలోచనో లేక తాను ఎంత బోల్డ్‌గా ఉంటుందో నిరూపించుకోవాలన్న తాపత్రయమో తెలియదు గానీ.. అషు రెడ్డి వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.

Anchor Manjusha clicked at a private Event!

Sridevi Soda Center Official Trailer, Sudheer Babu, Karuna Kumar!