టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అందగత్తె రెజినా కాసాండ్రా. కానీ, సరైన హిట్లు పడకపోవడం..కొత్త హీరోయిన్ల రాకతో రెజీనా కెరీర్ డౌన్ అయిపోయింది. ప్రస్తుతం హీరోలెవరూ పట్టించుకోకపోవడంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కెరీర్ ను లాక్కొస్తోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తి, వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. కెరీర్ ఆరంభంలో ఆఫర్ల కోసం రెజీనా ఎంతో మందిని సంప్రదించిందట. అయితే ఓ రోజు ఒక వ్యక్తి రెజీనాకు కాల్ చేసి..ఛాన్స్ ఇస్తాను, అడ్జస్ట్‌మెంట్ కు ఒకే చెబితే వెంటనే షూటింగ్ పని చేసుకోవచ్చని అన్నాడట..
అప్పటికీ రెజీనా వయసు 20 ఏళ్లు. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటో రెజీనా ఏ మాత్రం అర్థం కాలేదట. దాంతో రెమ్యునరేషన్ గురించేమో అనుకుని ఓకే అని చెప్పి.. కాల్ కట్ చేసిందట. ఆ తర్వాత ఇదే విషయం గురించి తన మ్యానేజర్ ను అడగగా.. అసలు విషయం తెలిసి రెజీనాకు ప్యూజులు ఎగిరిపోయాయట. అడ్జస్ట్‌మెంట్ అంటే పడక సుఖం కోరుకుంటున్నాడని రెజీనాకు అప్పుడే అర్థమైందట. దాంతో అతను మళ్లీ ఫోన్ చేసినా ఎత్తలేదని.. ఆ సంఘటన తర్వాత అలాంటి చేదు అనుభవం మరెప్పుడూ ఎదురుకాలేదని రెజీనా చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి..!!