సాధారణంగా సినీ ప్రముఖులు తమ మాటలను పూర్తి నియంత్రణలో పెట్టుకుని మాట్లాడతారు. డబుల్ మీనింగ్ డైలాగులను పొరపాటున కూడా బయటకు రానీయరు. ఇందుకు విరుద్ధంగా రెజీనా మాత్రం డబుల్ మీనింగ్ డైలాగులను పేలుస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది. శాకినీ డాకినీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పురుషుల శృంగార సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె సరదాగా మాట్లాడినప్పటికీ.. లోతుగా ఆలోచిస్తే కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. చిత్ర ప్రచారంలో భాగంగా తెలుగు ఫుడ్ ఛానల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తనతో పాటు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్ నివేదా థామస్ కూడా పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో అబ్బాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. “మ్యాగీ లాగానే.. అబ్బాయిలు కూడా రెండు నిమిషాల్లోనే అయిపోతారు” అంటూ కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్ సదరు యాంకర్‌కు అర్థం కాక.. నిజమే అంటూ తలూపాడు. మీకు అర్థం కాలేదు నా జోక్ అనగానే.. నాకు అర్థమైంది ఇప్పుడు అంటూ తలపట్టుకున్నాడు. అయితే ఏ విషయంలో రెండు నిమిషాల్లో అబ్బాయిలు అయిపోతారనేది రెజీనా విశీదకరించి చెప్పలేదు. కానీ పరోక్షంగా అబ్బాయిల శృంగార సామర్థ్యం మీదే రెజీనా కామెంట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..!!