in

Regina cassandra ready to tell ‘breaking news’!

చెన్నై చిన్నది రెజీనా కాసాండ్ర మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే అరడజనుకుపైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో సినిమా మొదలెట్టేసింది. ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు దీనికి సుబ్బు వేదుల దర్శకుడు. రా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రెజీనాతో పాటు జేడీ చక్రవర్తి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

డిసెంబర్‌ మూడో వారం వరకు ఇక్కడే సినిమా షూటింగ్‌ కొనసాగుతుందని చిత్రబృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాకు ప్రముఖ రచయిత, దర్శకుడు బి. వి. ఎస్‌. రవి కథ అందించారు. ప్రవీణ్‌ లంకరాజు సంగీత సారథ్యం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక ‘బ్రేకింగ్ న్యూస్’ తో పాటు తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది రెజీనా. ‘శాకిని డాకిని’ చిత్రంలో నివేదా థామస్‌తో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ లో స్పెషల్ సాంగ్ మెరవనుంది..

Janhvi Kapoor To Make Her South Debut Opposite Jr NTR?

actress shriya saran at ccl 2021 press meet!