
రేణు దేసాయి ప్రస్తుతం టివి షో లు మరియు యాడ్స్ లో తప్ప మరే ఇతర మాద్యమాలలో నటించడం లేదు. అయితే త్వరలో ఆమె మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీదకు రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆమె మహేశ్ బాబు తన జిఎంబి పిక్చర్ లో నిర్మాణ సారధ్యం వహిస్తున్న మేజర్ మూవీ లో తను కూడా నటిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో అడవి శేష్ హీరో గా నటించడంతో ఒక ఇంపార్టంట్ లేడి రోల్ లో ఆమే నటిస్తుంది అని వార్తలు వినిపించాయి. అయితే ఈ మేరకు స్పందించిన రేణు దేసాయి, తాను ఏ సినిమాలో నటించడం లేదు అని తేల్చేసింది. ఒకింత అభిమానులకు భాధగా ఉన్నా త్వరలో వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి..

