in

payal rajput in ‘indian 2’!

హిరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ కమలహాసన్‌తో కలిసి నటించనుంది. ఈ విషయాన్ని పాయల్‌ సన్నిహితులే ధృవీకరించారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంతో కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌-2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌ ఇది. లైక ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మింస్తోంది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రకూల్‌ప్రీత్‌ సింగ్‌ హిరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పుడు వారి జాబితాలోకి కొత్తగా పాయల్‌ వచ్చి చేరింది. ఈ చిత్రంలో పాయల్‌ ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయబోతోందని తెలుస్తోంది. దర్శకుడు శంకర్‌ ఈ ప్రత్యేక గీతాన్ని భారీ సెట్టింగులతో చిత్రీకరిస్తున్నారని సమాచారం. కరోనా ప్రభావం తగ్గితే ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది..

redu desai clears the rumors!

45 years for Annadammula Anubandham!