in

records paranga bahubali ni thaladannina lavakusha!

ప్పుడంటే మొదటి కలెక్షన్ల మీదే ఆధారపడి సినిమా హిట్టా.. ప్లాపా అనేది డిసైడ్ చేస్తున్నాం. ఈ కమర్షియల్ లెక్కల్నే దృష్టిలో ఉంచుకుని దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. హీరో మార్కెట్ ఎంత.. బడ్జెట్ ఎంత పెట్టాలి. పెట్టిన బడ్జెట్ ను ఎలా రాబట్టుకోవాలి ఇదే దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. తప్పు లేదు ఇప్పుడున్న ఫ్యాన్స్ ప్రేక్షకులు అవే దృష్టిలో పెట్టుకుని సినిమా తలరాతని డిసైడ్ చేస్తున్నారు. అయితే అప్పటి రోజుల్లో ‘లవకుశ’ అనే సినిమా రికార్డులను చూస్తే ఇప్పటి ప్రేక్షుకులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. ‘లలిత శివజ్యోతి ఫిలింస్’ పతాకంపై ఎ. శంకర్ రెడ్డి నిర్మాణంలో సి.పుల్లయ్య డైరెక్ట్ చేసిన ‘లవకుశ’ చిత్రం 23-03-1963న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, అంజలి దేవి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగునాట వసూళ్ళ పరంగా కోటి రూపాయల ఖజానాకు తొలిసారి ద్వారాలు తెరిచింది ఈ చిత్రమే. ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా కుంభవృష్టి కురిసిందనే చెప్పాలి.

మొదట 26 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం .. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులుకు పైబడి నడిచి.. నూట యాభై రోజులు అయినా కలెక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడి రికార్డ్ సృష్టించింది. 18 కేంద్రాలలో రజతోత్సవ వైభవాన్ని పొందింది ఈ చిత్రం. 75 వారాలు ప్రదర్శింపబడి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ‘ఎ’ సెంటర్.. ‘బి’ సెంటెర్ అనే తేడా లేదు ప్రతీ సెంటర్లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

కరెంట్ లేని రోజుల్లో మారుమూల ప్రాంతాల నుండీ జనం సైకిళ్ళు వేసుకుని.. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎడ్లబళ్ళు కట్టుకుని … చద్దన్నం మూటలతో థియేటర్స్ కు తరలి వచ్చారు. క్యాబ్ లు, బస్సులు కాదు కదా.. కనీసం కరెంట్ అంటూ లేని రోజుల్లో పావలా, పది పైసల టికెట్ రోజుల్లో 1 కోటి రూపాయలు వసూల్ చేయడమంటే మాటలు కాదు. ఈ చిత్రంలో శ్రీరాముడుగా ఎన్టీఆర్ రూపం, అభినయం సమ్మోహనపరిచిందనే చెప్పాలి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ చిత్రం తమిళ వెర్షన్ 40 వారాలు , హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం.ఒక్కమాటలో చెప్పాలంటే… ‘బాహుబలి’ కూడా ఆ విషయంలో ‘లవకుశ’ రికార్డును కొట్టలేదనే చెప్పాలి.

i will marry prabhas : kajal

NAGA BABU NI DANCHI KOTTINA CHIRANJEEVI!