in

REASON BEHIND ANIL’S SON NAME!

హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఈ సంక్రాంతికి ఆ హిట్టే కాక మరో గుడ్ న్యూస్ కూడా ఉంది అదేమిటంటే…సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరుగుతున్న సమయంలోనే అనిల్ రావిపూడి భార్య ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు ఆయన పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఆనందం .. ఆ సమయంలో ఆయన పొందిన అనుభూతి ఎప్పటికీ గుర్తుండేలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ‘సరిలేరు నీ కెవ్వరు’ సినిమాలో మహేశ్ బాబు పాత్ర పేరు ‘అజయ్ కృష్ణ’. ఆ పాత్ర నుంచే ‘అజయ్’ను తీసుకుని, ఆ పేరు పక్కన ‘సూర్యాంశ్’ ను జోడించాడు. అలా ఆయన తన కుమారుడికి ‘అజయ్ సూర్యాంశ్ ‘అని నామకరణం చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మహేశ్ బాబు పట్ల అభిమానం.ఆ పాత్ర పట్ల ప్రేమ కారణంగానే తాను అలా చేశానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

CHILD ARTISTS TURNED INTO STAR HEROES!

POOJA SHOOTS FOR FEMINA!